రైతుల సేవయే లక్ష్యంగా పని చేయాలి: దండు రమేష్

Service of farmers should be the aim: Dandu Ramesh– గత చైర్మన్ పాలనలో అవినీతి మయం
– జిల్లాలోనే  సొసైటీని ఆదర్శంగా నిలపాలి: మాజీ ఎంపీపీ మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం రైతు సేవయే లక్ష్యంగా పని చేయాలని, మాజీ  చైర్మన్ చెప్యాల రామారావు సొసైటీని అవినీతి మయంగా మార్చడని మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, జిల్లా కార్యదర్శి అయిత రాజిరెడ్డి ఆరోపించారు.సోమవారం  పిఏసిఎస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇప్ప మొoడయ్య ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పిఏసిఎస్ కార్యాలయం నుంచి తాడిచెర్ల  హనుమాన్ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వెళ్లి బాణ సంచా కాల్సి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత మాజీ ఛైర్మన్ నాలుగున్నర  సంవత్సరాలు సొసైటీని బ్రష్టు పట్టించాడని, అక్రమాలకు, అవినీతికి పాల్పడి దోచుకున్నట్లుగా పేర్కొన్నారు. అవినీతిలో 51వ విచారణతో అధికారులు తగిన బుద్ది చెప్పినట్లుగా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అస్సిస్సులతో ఎన్నికైన చైర్మన్ తోపాటు పాలకవర్గం అవినీతి రహితంగా పాలన అందిస్తూ రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తనాలు,ఎరువులు, రైతులకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు అందించాలని కోరారు.అలాగే కొనుగోలు కేంద్రాలతోనే సొసైటీకి ఆదాయం ఉంటుందని, ఆదాయం ఉంటేనే సొసైటీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఇప్ప మొoడయ్య,వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు, డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు, సంగ్గెం రమేష్,సర్వర్ నాయక్, మాజీ సర్పంచ్ లు రాజు నాయక్, ఇందారపు చెంద్రయ్య, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య, కిషన్ నాయక్,కుంట సది,రాజు నాయక్, విష్ణు వర్ధన్ రెడ్డి, రాహుల్,తిర్రి సమ్మయ్య,అశోక్,ఆకుల శ్రీనివాస్, రావుల అంజయ్య, చిన మల్లయ్య,జక్కుల వెంకట స్వామి,మహేష్,బండి స్వామి,మధు తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.