
– మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ చేతి గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భూపాలపల్లి కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు ఓటర్లను కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ చేతి గుర్తుకు ఓటు వేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని మల్లంపల్లి, ఇప్పలపల్లి,కొండంపేట గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని గెలిపిస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మేనిపేస్టో లో పెట్టిన ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ, ఎంపీటీసీ ప్రకాష్ రావు, మండల యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మండల రాహుల్, యూత్ నాయకులు సవెందర్, మంథని రాజ సమ్మయ్య, జంపయ్య, కాంగ్రెస్ నాయకులు చిన్నమల్లు, శ్రావణ్, పోటు ప్రభాకర్ రెడ్డి,రెవెళ్లి లింగయ్య, మమత, జంగిడి సమ్మయ్య, చంద్రగిరి అశోక్, బోయిని రాజయ్య, జనగామ బాపు, లక్ష్మీ రాజాం, శంకర్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.