కేసీఆర్‌ పర్యటనలో ప్రమాదం

– ముందు కారు బ్రేక్‌ వేయడంతో ఒకదానినొకటి ఢకొీన్న వాహనాలు
– పాక్షికంగా దెబ్బతిన్న బీఆర్‌ఎస్‌ శ్రేణుల కార్లు
నవతెలంగాణ-వేములపల్లి
మాజీ సీఎం కేసీఆర్‌ మిర్యాలగూడ పర్యటన సందర్భంగా ముందు కారు అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో ఒకదానినొకటి ఢకొీని ఎనిమిది కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి నార్కట్‌పల్లి రహదారిపై బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ రోడ్‌షోలో పాల్గొనేందుకు కేసీఆర్‌ బయలుదేరిన క్రమంలో.. ఆయన వెనకాలే వెళ్తున్న బీఆర్‌ఎస్‌ శ్రేణుల వాహనాల్లో ముందు ఉన్న కారు సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుకగా వస్తున్న ఎనిమిది కార్లు ఒకదానినొకటి ఢకొీన్నాయి. దాంతో కార్ల ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.