ప్రాసెస్‌ ఫుడ్‌తో ప్రమాదం…

ప్రాసెస్‌ ఫుడ్‌తో ప్రమాదం...మారిన కాలంతో పాటు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు వచ్చాయి. ఫాస్ట్‌ ఫుడ్‌, ప్రాసెసింగ్‌ ఫుడ్‌కు ఎక్కువగా ఆదరణ పెరుగుతోంది. సూపర్‌ మార్కెట్లు, బేకరీలు చిన్న చిన్న పట్టణాల్లోకి కూడా అందుబాటులోకి రావడంతో ప్రజల ఆహారపు అలవాట్లలో భారీగా మార్పులు వచ్చాయి. అయితే ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ప్రాసెస్‌ ఫుడ్‌ కారణమవుతుందని చెబుతున్నారు. ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే అవకాశం పెరుగుతుంది. సాధారణంగా ప్రాసెస్‌ చేసిన ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో చక్కెర, ఉప్పు కంటెంట్‌ను ఎక్కువగా యాడ్‌ చేస్తుంటారు. వీటిలో ప్రమాదకరమైన రసాయనాలతో పాటు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉంటాయి. ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తినడం ఊబకాయం, వద్ధాప్యం వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.
ప్యాకింగ్‌ ఫుడ్‌ ఎక్కువగా నిల్వ ఉండేందుకు గాను.. ఎక్కువ మొత్తంలో స్టార్చ్‌ను ఉపయోగిస్తారు. స్టార్చ్‌ అనేది ఒకరమైన పాలిమర్‌.. ఇది గ్లూకోజ్‌ చైన్‌ లో ముఖ్యమైన భాగం. ఆహారంలో అధిక మొత్తంలో స్టార్చ్‌ ఉండటం వల్ల, శరీరం లో చక్కెర స్థాయి ప్రమాదం చాలా పెరు గుతుంది. ఇది శరీరంలో ఉన్న కణజా లాన్ని కూడా దెబ్బతీస్తుంది. చర్మ ఆరోగ్యా న్ని దెబ్బ తీస్తుంది. టిక్‌ ప్యాక్‌ ఆహారాల్లో ట్రాన్స్‌ ఫ్యాట్‌ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.