ప్రమాదకరంగా బస్టాండు రోడ్డు

నవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణ టి ఎస్ ఆర్ టీ సీ బస్టాండ్ ప్రాంగణం నుండి బస్సులు బయటకు వెళ్లే దారి ప్రమాదకరంగా మారింది. మలుపు ఉండడం తో వచ్చిపోయే వాహనాలకు ప్రయాణికులకు నరకయాతన తలపిస్తుంది. గతంలో మురుగు నీరు బస్టాండ్ ఆవరణలోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడగా అధికారులు తాత్కాలిక మరమ్మత్తు పనులు చేశారు. బండ రాళ్లు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.