ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ ఫారంను వేరే చోటికి మార్చాలి

– డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు యండి. సలీం
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోని 16 వ వార్డులో ఇండ్ల మధ్య ప్రమాదకరంగ ఉన్న ట్రాన్స్ ఫారంను  వేరే చోటుకు మార్చాలని డివైఎఫ్ఐ భువనగిరి పట్టణ కమిటి ఆద్వర్యంలో విద్యుద్ శాఖ ఎఇ కి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగ ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యండి. సలీం మాట్లాడుతు ప్రమాదకరంగ ఉన్న ట్రాన్ప్సరం  వలన స్థానిక ప్రజలు భయందోళనకు గురైతున్నారని అన్నారు. గతంలో కోతులు ఆ ట్రాన్స్పరంను తాకి చనిపోయిన సందర్భాలున్నాయి. అలాగే చిన్న పిల్లలు పరిసర ప్రాంతాలలో ఆడుకోవడండి వలన ప్రమాదానికి గురయ్యె ఆవకాశం ఉందని వీలైనంత త్వరగ ట్రాన్స్ ఫారంను మార్చాలని కోరారు.  ఈ కార్యక్రమంలో నాయకులు యండి. సాజిద్, షేక్ రియాజ్, యండి. సోహేల్, యండి.సల్మాన్, రజాక్  పాల్గొన్నారు.