
మండలంలోని అంతంపల్లి, భిక్కనూర్, పెద్ద మల్లారెడ్డి, బస్వాపూర్ గ్రామాలలోని సొసైటీ కేంద్రాలను శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా సొసైటీలోని ఎరువుల రికార్డులను పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా సొసైటీలలో ఎరువులు, విత్తనాలు అందించాలని సీఈఓ లకు తెలియజేశారు. కార్యాలయాల రికార్డులు, వివరాలు పరిశీలించి ఈపాస్ మెషిన్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఏ అపర్ణ, ఏవో శోభ, ఆయా గ్రామాల ఏఈవోలు, సొసైటీ సీఈవోలు, తదితరులు ఉన్నారు.