ఎరువుల దుకాణాల్లో డీఏఓ ఆకస్మిక తనిఖీలు 

– అనుమతి పత్రాల్లోలేని ఉత్పత్తుల అమ్మకాల నిలిపివేత 
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంతో పాటు రేగులపల్లి,గుండారం గ్రామాల్లోని ఎరువుల,విత్తనాల దుకాణాలను సోమవారం డీఏఓ కొరపాటి శివ ప్రసాద్ క్షేత్ర స్థాయిలో సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువుల దుకాణాల అనుమతుల పత్రాలు,నిల్వ ఉన్న ఎరువులు,విత్తనాలు,నిల్వ ఉత్పత్తుల వివరాల రికార్డులను పరిశీలించారు. ఎరువుల దుకాణాల యాజమానులు జిల్లా వ్యవసాయ శాఖ నిబంధనల ఉల్లంఘించి రికార్డులు నమోదు చేయడంతో డీఏఓ అగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి పత్రాల్లో జతపరచని ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలని అదేశాలు జారీ చేశారు. తనిఖీల్లో ఏఓ సంతోష్ కుమార్,ఆత్మాధికారి సాయిచరణ్,ఏఈఓ సాయి శంకర్ పాల్గొన్నారు.