– బలహీనవర్గాలు పనిచేసే పారిశుధ్య విభాగ కార్మికులను క్రమబద్ధీకరించాలి
– ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్
– ఫిబ్రవరి 29న పోరు గర్జన
– కరపత్రం ఆవిష్కరణ
నవతెలంగాణ-ముషీరాబాద్
డప్పు, చెప్పు వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని, బలహీనవర్గాలు పనిచేసే పారిశుధ్య విభాగ కార్మికులను క్రమబద్ధీకరించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయం లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సభ్యులు బంగారు శీను, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకటేష్ హాజరై ఫిబ్రవరి 29న పోరు గర్జన కరపత్రన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాయితీతో పని చేస్తూ విలు వలు పెంపొందించే విధంగా కృషి చేయాల న్నారు. సామాజిక న్యాయం జరగాలంటే ఉద్యమిచాలన్నారు. పనిచేసి బతుకుతూ సమాజంలో ఉత్తమ స్థాయికి చేరుకోవాలని తెలిపారు. గతంలో డప్పు చెప్పు కులవృత్తులకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ అధ్వర్యంలో మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశామని గుర్తు చేశారు చెప్పు, డప్పు వృత్తి కులాల వారికి నేలకు ఐదు వేలు రూపాయలు పింఛన్లు అందించాలని కోరారు. న్యాయం కోసం కృషి చేస్తూ, పోరాటం కొనసాగిస్తామన్నారు. వర్గీకరణతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, అన్ని ఉప కులాలకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికులను క్రమబద్ధీ కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని మంత్రివర్గంలో మాదిగలకు సమూచిత స్థానం కల్పించాలని, ట్యాంకు బండ్‌పై సదాలక్ష్మి విగ్రహా న్ని పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కోరారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు పసలాది యాదగిరి చాప కృష్ణ, సిహెచ్ ఎల్లయ్య, యూ అండాలు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నంద కిషోర్, కాదాసి రాహుల్, కాసర్ల సురేష్, బోటిక మహేష్, కల్లేపెళ్లి సురేష్, గడుసు సాయిలు, దయాకర్, ఎర్ర నగేష్ మంద పాండు, పాలడు గు గణేష్, బలరాం, పందిరి బాబురావు, పోల పల్లి చంద్రశేఖర్, విశాల్, ముక్కెర్ల రవీందర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.