రానా దగ్గుబాటి మూడవ సారి వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో చేతులు కలిపారు. ‘పరేషాన్, 35 చిన్న కథ కాదు’ చిత్రాల విజయం తర్వాత రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి ‘డార్క్ చాక్లెట్’ చిత్రాన్ని అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదలైంది. ‘జోనర్ ఆడగొడు, మాక్కూడా తెలీదు’ అని పోస్టర్ పై రాయడం ఈ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది.