గత పదేండ్లకు పైగా మనదేశంలో పచ్చి మితవాద ఫాసిస్టు శక్తుల వీరంగం చూస్తున్నాం. ముస్లిం మైనారిటీల మీద, క్రైస్తవుల మీద, వారి ప్రార్థనాలయాల మీద దాడులు, తద్వారా సమాజంలో ఓ భయానకమైన వాతావరణాన్ని సష్టిస్తున్నాయి. మరోపక్క ప్రజాస్వామ్యవాదులను, ప్రభుత్వాన్ని విమర్శించే సంస్థలను, వ్యక్తులను అడ్డ గోలుగా నెలల తరబడి నిర్బంధించడం నిత్యకత్యంగా మారింది. సహజంగానే మన దష్టంతా దేశంలో పెరు గుతున్న మితవాద ఫాసిస్ట్ ధోరణుల మీద, పార్టీల మీ ద, సంస్థల మీదే ఉంటుంది. కానీ వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగానే నయా ఫాసిస్ట్ పచ్చి మితవాద శక్తులు విజంభిస్తున్నాయి. అర్జెంటీనా, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీ వంటి దేశాలలో మతతత్వ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి సామ్రాజ్యవాద దేశాల్లో కూడా 2022-23లలో జరిగిన ఎన్నికలలో నయా ఫాసిస్టులు దాదాపు అధికారంలోకి వచ్చినంతగా పెరిగారు. అమెరికా, ఇంగ్లం డ్‌లలో ఈ ధోరణులను అధికార ప్రతిపక్ష పార్టీలే ప్రోత్సహిస్తు న్నాయి. మానవత్వం, సమానత్వం, సౌభ్రాతృత్వం, శాస్త్రీయ దక్ప థం వంటి అత్యంత కీలక అంశాల మీద అంతర్జాతీయ వేదికలు, సంస్థలు చేసిన తీర్మానాలన్నింటిని బహిరంగంగా పెట్టుబడిదారీ దేశాలు తుంగలో తొక్కుతున్నాయి. నిశితంగా పరిశీలిస్తే ప్రపంచ వ్యాపితంగా, అందులో భాగంగా మనదేశంలో కూడా ఈ చీకటి శక్తులు బలపడటానికి అనేక సాధారణ కారణాలు మనకు కనిపి స్తాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనాపై ఇజ్రాయిల్ అమా నుష దాడి, పర్యవసానంగా ప్రపంచంలోని అత్యధిక భాగంలో యుద్ధ వాతావరణం అలుముకుని ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా అండ చూసుకుని ప్రపంచ యుద్ధం ప్రారంభం కానున్నదని హెచ్చరిస్తున్నాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ని విమర్శిస్తూ అమెరికా బలహీన పడుతున్నదని, మరోసారి ప్రపంచ యుద్ధం కనుచూపు మేరల్లో ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు.
యుద్ధోన్మాదం, జాతి, మత, ఉన్మాదాల కలయిక
అనేకమంది అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు, మేధావులు ఈ పరిస్థితిని మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం ముందు నాటి కాలాలు పునరావతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రపంచాన్ని కుదిపే స్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ మరీ ముఖ్యం గా పాలస్తీనాపై ఇజ్రాయిల్ నెలల తరబడి జరుపు తున్న మారణకాండను, పర్యవసానంగా ప్రపంచం లో పెరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని, ఉద్రిక్తతల ను పరిశీలిస్తే యుద్దోన్మాదం, మత,జాతి ఉన్మాదాలు హెచ్చరిల్లుతున్నాయని స్పష్టం అవుతుంది. పాలస్తీ నాకి మద్దతుగా మధ్య ప్రాచ్యంలోని అనేక ఇస్లాం రాజ్యాలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రతిగా సామ్రా జ్యవాద దేశాలు క్రైస్తవ మత భావజాలానికి మద్ద తుగా అన్నట్లు ఇజ్రాయిల్‌ని బలపరుస్తున్నాయి. 2023 డిసెంబర్ 29వ తేదీన దక్షిణాఫ్రికా ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయిల్ మానవ ఖననంపైన కేసు వేసింది. దీనికి మద్దతుగా బంగ్లాదేశ్, జోర్డాన్ ఇంకా అనేక లాటిన్ అమెరికా దేశాలు కోర్టుకు పత్రాలు సమర్పించాయి. జర్మనీ, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు ఇజ్రాయిల్‌కి మద్దతు తెలియ జేస్తూ కేసు దఖలు పరిచాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశంలో పెరుగుతున్న నయాఫాసిస్టు ఒత్తిడికి తలొగ్గి న్యాయ స్థానం మీదే తీవ్ర విమర్శలు ప్రారంభిం చింది. గతంలో మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల మీద జరుగుతున్న మారణకాండపై గాంబియా ప్రభుత్వం ఇదే కోర్టులో వేసి న కేసుని బలపరిచిన జర్మనీ ఇప్పుడు ఇజ్రాయిల్ మారణ కాండని బలపరుస్తూ ముందుకు రావడం యాదచ్ఛికం కాదు. తాజాగా ఇరాన్ బలపరుస్తున్న షియా మిలిటెం ట్లు జోర్దాన్‌లో పొంచి ఉన్న అమెరికా సైనిక దళాలపై డ్రోన్ దాడులు ప్రారంభించాయి. అంతర్జాతీయ న్యాయ స్థానం పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయిల్ దాడులు నిలవరించమని ఆదేశించినా, ఇజ్రాయిల్ తాను రక్షణ దాడులు మాత్రమే చేస్తున్నానని బుకాయిస్తున్నది. అందు కు సామ్రాజ్యవాద దేశాలు వంతపాడటం ఈ అంతర్జా తీయ న్యాయస్థానం అస్తిత్వాన్నే ప్రశ్నించే పరిస్థితి దాపు రించింది. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం కూడా సా మ్రాజ్యవాదుల అదుపాజ్ఞలలోనే ఉంటుందన్న అపోహ ను ఈ పరిణామాలు బలపరుస్తున్నాయి. ఇంత తీవ్ర మైన పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా ‘విశ్వగురువు’ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అమెరికా ప్రాపకం కోసం ఇజ్రాయిల్‌ని బలపర్చడం, దాని యుద్ధోన్మాద, మతోన్మాద, ఫాసిస్ట్ విధానాలకు నిదర్శనం
ఆర్ధిక సంక్షోభం అసలు రహస్యం
సంక్షోభాలు రావడం, పోవడం పెట్టుబడిదారీ వ్యవస్థకు కొత్త కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థను సంపూర్ణంగా ‘స్కాన్’ చేసిన కార్ల్ మార్క్స్ పెట్టుబడి గ్రంథంలోనూ, ఇతర అనేక తన అమూల్య రచన ల్లోనూ స్పష్టంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు మూడు లక్షణాలు ఉంటా యని ప్రకటించారు. ఒకటి ఆర్థిక సంక్షోభాలు. రెండు యుద్ధాలు. మూడు అసమాన అభివద్ధి. ప్రస్తుత ప్రపంచంలో ఈ మూడు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇందులో ప్రత్యేకించి ఆర్థిక సం క్షోభం గురించి చెప్పుకోవాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడిన తరు వాత 1929-30లలో వచ్చిన ఆర్థిక సంక్షోభం అప్పటికి చాలా పెద్దది. భయానకమైనది. దాన్ని అధిగమించగలిగిన పెట్టుబడిదారీ వ్యవస్థ 2008లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం నుండి బయట పడలేని ఒక తీవ్రమైన దుస్థితికి చేరుకున్నది. నాలుగు, ఐదేండ్లు మించకుండానే అనేక దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నుంచి బయటపడుతూ వచ్చింది. కానీ ఈ తడవ 16 సంవత్స రాలు గడుస్తున్నా అతీగతీ కనపడటం లేదు. పరిష్కారం కోసం ఎంత ప్రయత్నించినా జబ్బు వికటిస్తుందే తప్ప బయటపడుతుం దన్న ఆశ కనబడటం లేదు. ఈ ఆర్థిక సంక్షోభం యొక్క పర్యవ సానం రాజకీయ, సాంఘిక రంగాల మీద తీవ్రంగా పడుతున్నది. దశాబ్దాలుగా పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడుకుంటూ వస్తున్న ఉదారవాద ప్రజాస్వామ్యం కళ్ళు తేలేసింది. ప్రొఫెసర్ ఐజాజ్ అహ్మద్ చెప్పినట్లు ఈ ఉదారవాద ప్రజాస్వామ్యం కనుమరుగవుతూ దాని స్థానంలోకి పచ్చి మితవాద, నయా ఫాసిస్టు లేక ఫాసిస్టు తరహా శక్తులకి భారీ ఊతం ఇస్తున్నది. అంతేకాదు పథకం ప్రకారం ఆయా దేశాల్లో విప్లవ శక్తులను, సోషలిస్టు భావజాలాన్ని దరిచేరనీ యకుండా చూడటం మరో ముఖ్యమైన పరిణామం. ఈ పరిస్థితి అన్ని దేశాల్లో లాగానే మనదేశంలో కూడా మనకి కనపడుతున్నది. మధ్యేవాద పార్టీలు, ఆయా దేశాల్లో ఉన్న లౌకిక రాజ్యాంగాలు, గణ తంత్ర పరిపాలన విధానాలు, వ్యవస్థలను తొలుచుకుంటూ మిత వాద శక్తులు అధికార పీఠాలని చేజిక్కించుకుంటున్నాయి. మధ్యే వాద పార్టీలు లేక సెంటర్ లెఫ్ట్ పార్టీలు కోలుకోలేనంతగా బలహీన పడుతున్నాయి. పైగా ఈ బలహీనతను అధిగమించ డానికి మితవాద ధోరణులనే ఆసరా చేసుకోవడానికి పూనుకోవ డంతో మరింత బలహీన పడుతున్నాయి. దీనిని ప్రముఖ రచయిత, తత్వవేత్త అయిన సోవోజ్‌జిజెక్ ”లెనిన్ దగ్గర్నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే, లిబరల్ డెమోక్రసీ, సోషల్ డెమోక్రసీలను చాప చుట్టి అవతల పారేయాలి. ప్రయివేటు ఆస్తి హక్కు లేకుంటే ఈ రెండు ప్రత్యామ్నాయాలు బతికి బట్ట కట్టలేవు. నికార్సుగా మనం పెట్టుబడిదా రీ వ్యతిరేకతను ప్రదర్శించాలంటే ఈ రెండు ప్రజా స్వామ్యాల మీద ఉన్న మోజు వదిలి పెట్టాలి” అని చెప్పాడు. ఈరోజు అనేక దేశాలలో ఉదారవాద ప్రజాస్వామ్య పార్టీలే కాకుండా సోషల్ డెమోక్రటిక్ పార్టీలుగా ఉన్న వామపక్షాలు కూడా ప్రజల నుండి దూరమవుతున్నాయి. తిరస్కరించబడుతున్నాయి. నయా ఉదారవాదం బడా కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడు తున్న పార్టీలనే ప్రజలు ఆదరించడం జరుగుతున్నది.
సోషలిజం తప్ప మరో మార్గం లేదు
అమెరికా ఇతర సామ్రాజ్యవాద దేశాలను కలు పుకొని సష్టించాలనుకుంటున్న ఓ నూతన ప్రపంచా నికి కేంద్ర బిందువు చైనా వ్యతిరేకత, సోషలిజం వ్యతిరేకత. అందుకు పై అనేక ఉదాహరణలతో పాటు ఆర్థికంగా అత్యంత బలోపేతం అవుతున్న చైనాను దెబ్బతీయడానికి అనేక కూటములను కడుతున్నది. అంతర్జాతీయ వేదికల మీద చైనాను, క్యూబాను, ఉత్తరకొరియాను లక్ష్యంగా పెట్టుకొని దాడులు నిర్వహిస్తున్నది. అత్యధిక దేశాలు ఖండించినా, ఐక్యరాజ్యసమితి తిరస్కరించినా క్యూబాపై ఆంక్షలను ముమ్మరం చేస్తున్నది. తన మాట కాదంటే ఐక్య రాజ్యసమితినే నిర్వీర్యం చేస్తానని హెచ్చరిస్తున్నది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ చీకటి శక్తులకు వ్యతి రేకత కూడా క్రమంగా ఊపందు కుంటున్నది. అనేక లాటిన్ అమె రికా దేశాలలో మార్పు ఈ కాలంలో మనం గమనిస్తున్నాం. బ్రెజిల్ లో లూలా గెలవడం, వెనిజులాలో ఎన్ని అవరోధాలు సష్టించినా మధురో బలపడటం, దశాబ్దాల అనంతరం చిలిలో వామపక్ష ప్రభు త్వం ఏర్పడటం, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలలో విస్తతంగా కార్మిక వర్గ, విద్యార్థి, ఉపాధ్యాయ పోరాటాలు వెల్లువెత్తడం మనం చూస్తున్నాం. అలాగే సామ్రాజ్య వాద ఒత్తిడులకు వ్యతిరేకంగా అనే క అంతర్జాతీయ కూటములు ముందుకొస్తున్నాయి. వీటన్నింటి లోనూ మనకు కనబడుతున్నది ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సాంఘిక సమస్యలు వేటినీ ఇక పెట్టుబడిదారీ వ్యవస్థ పరిష్కరిం చలేదని. ప్రత్యామ్నాయం అనివార్యమని క్రమంగా ప్రజలు గుర్తిం చడం ఆరంభమైంది. ఈ దశలో సోషలిజం తప్ప మరోమార్గం లేద ని లేదన్న భావనలు తెరపైకి రావడం యాదచ్ఛికం కాదు.
ఆర్. రఘు
9490098422
చీకటిశక్తులు విస్తరిస్తున్నాయి
10:52 pm