ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకుడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత చైతన్య రెడ్డి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘హను-మాన్‌తో పెద్దసక్సెస్‌ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ మాదే కాదు ప్రేక్షకుల సక్సెస్ కూడా. మేం ఫలితం ఆశించకుండా మా ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని ఇచ్చారు. ‘హను-మాన్’ తర్వాత డార్లింగ్ లాంటి స్క్రిప్ట్ చేయడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ సబ్జెక్ట్‌కి డైరెక్టర్, ప్రొడ్యూసర్ బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళది లవ్ మ్యారేజ్, మాది లవ్ మ్యారేజ్. మ్యారేజ్ అయి పద్నాలుగేళ్ళ తర్వాత లైఫ్ చాలా రొటీన్ అయిపోతుంది. సినిమాకి వెళ్ళడం కూడా ఒక పనిగా చూస్తాం. మొదట్లో ఎలా ఉన్నాం.. పిల్లలు వచ్చాక జీవితంలో బిజీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటున్నాం.. ఈ పాయింట్ డైరెక్టర్ అశ్విన్ చెప్పినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాం. కంటెంట్ విన్న వెంటనే ఓకే అన్నాం. ఈ జనరేష్‌కి అర్థమయ్యేలా హ్యూమర్, ఫన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా తీర్చిదిద్దాం. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే ఎంటర్‌టైనర్. ఈ కథకు ప్రియదర్శి, నభా నటేష్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, హీరోకి చాలా ఇన్నోసెంట్, సింపుల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. హీరోయిన్ హైఫై, సోషల్ లైఫ్ యాక్టీవ్‌గా ఉండాలి. హీరో, హీరోయిన్‌కి ఈక్వెల్ ఇంపార్ట్టెన్స్ ఉండే క్యారెక్టర్స్. ఈ పాత్రలకు ప్రియదర్శి, నభా పెర్ఫెక్ట్ యాప్ట్ అని భావించాం. ఈ సినిమాకి సభా పెద్ద ఎసెట్. తనది చాలా పాజిటివ్ రోల్. ఉమెన్ రెస్పెక్ట్ పెంచేలా ఆ పాత్ర ఉంటుంది. తెలుగులో ప్రేక్షకులకు నచ్చి ఆదరిస్తే.. ఇంకా పెద్ద కాస్ట్‌తో ఇతర భాషల్లో రీమేక్ చేస్తాం. వివేక్ సూపర్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా చేశారు. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. అలాగే సాయి ధరమ తేజ్ సినిమా అనౌన్స్ చేశాం. మరో పది సినిమాలు ప్రీప్రొడక్షన్‌లో ఉన్నాయి. దాదాపు మూడేళ్ళలో ఈ పది సినిమాలు రిలీజ్‌కి వచ్చేస్తాయి’.