సరికొత్త కంటెంట్‌తో డార్లింగ్‌

సరికొత్త కంటెంట్‌తో డార్లింగ్‌ఈ సంవత్సరం ప్రారంభంలో పాన్‌ ఇండియా సెన్సేషన్‌ ‘హను-మాన్‌’ అందించిన బ్లాక్‌బస్టర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ తాజాగా ప్రియదర్శి, నభా నటేష్‌ లీడ్‌ రోల్స్‌లో ‘డార్లింగ్‌’ అనే రోమ్‌-కామ్‌ ఎంటర్‌టైనర్‌తో వస్తోంది. నిరంజన్‌ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్‌ రామ్‌ రైటర్‌, డైరెక్టర్‌. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, ఫస్ట్‌ సింగిల్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అనౌన్స్‌ చేశారు. రోమ్‌-కామ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీతో మరో బ్లాక్‌బస్టర్‌ని స్కోర్‌ చేయడంపై మేకర్స్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్‌లో మోస్ట్‌ రిలేటేబుల్‌ కంటెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం రెడీగా ఉందని చిత్ర బృందం తెలిపింది. బ్రహ్మానందం, విష్ణు, కష్ణతేజ్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈచిత్రానికి రచన- దర్శకత్వం: అశ్విన్‌ రామ్‌, సంగీతం: వివేక్‌ సాగర్‌, డీవోపీ: నరేష్‌ రామదురై, ఎడిటర్‌: ప్రదీప్‌ ఇ రాఘవ, డైలాగ్స్‌: హేమంత్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: గాంధీ, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: సీతారామ్‌ వై, లిరిక్స్‌: కాసర్ల శ్యామ్‌, కొరియోగ్రాఫర్‌: విజరు పోలాకి, ఈశ్వర్‌ పెంటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ : ప్రకాష్‌ రెడ్డి పన్నాల, వంశీ సంగెం, లైన్‌ ప్రొడ్యూసర్‌: మంచి వెంకట్‌.