
నవతెలంగాణ -తాడ్వాయి
వర్షాలు విస్తారంగా కురిసి, బీభత్సంగా ఉన్న కారణంగా మేడారం వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులు దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు మేడారం ఈవో రాజేంద్రం లు భక్తులను కోరారు. గతంలో కురిసిన వర్షాల కంటే ఈసారి కురిసిన వర్షాలు నానా బీభత్సవాన్ని సృష్టించాయని, రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయని, రహదారులు సరిగా లేవని చెప్పారు. వరద నీరు మేడారం గద్దెలు, మేడారం ఎండోమెంట్ ఆఫీస్ వరకు చేరుకున్నాయని తెలిపారు. వర్షాలు తగ్గిపోయి మామూలు పరిస్థితులు వచ్చేవరకు మేడారానికి సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనకు వచ్చే భక్తులు రాకూడదని తెలిపారు.