మడలయ్య దేవాలయానికి దర్వాజా వితరణ

నవతెలంగాణ – చండూర్
గట్టుపల మండలంలోని  అంతంపేట గ్రామంలో రజకుల కుల దైవమైన  శ్రీ మడేలయ్య దేవాలయానికి  మండల బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు వీరమల్ల రాజు గౌడ్  తన సొంత ఖర్చతో రూ.20వేల రూపాయలు తో  గుడికి దర్వాజా  శుక్రవారం విచారణ చేశారు. అనంతరం గుడి దగ్గర దర్వాజా పూజా కార్యక్రమాలు చేసి దర్వాజా లేవనెత్తారు. రజక సంఘం నాయకులు ఆయనకు శాలువాగప్పి  సన్మానం చేశారు.  మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి  దేవాలయ  మరింత  అభివృద్ధికి సహకరించాలని కోరారు.   ఈ కార్యక్రమంలో   అంతంపేట గ్రామ పెద్దలు యువజన నాయకులు, మడేలయ కుల పెద్దలు పాల్గొన్నారు.