దేశ వ్యాప్తంగా జరిగే కార్మిక డిమాండ్స్ ను జయప్రదం చేయండి: దాసరి పాండు

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
దేశవ్యాప్తంగా  10 తేదీన జరిగే కార్మికుల డిమాండ్స్ డే ను కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు  అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడి టీచర్లకు ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాలని చేస్తున్న  రిలే  దీక్షలు మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్కీం లన్నింటిని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి చూస్తున్నారట కార్మిక వర్గం ప్రయోజనాలను పూర్తిగా విస్మరించినారని ఐసిడిఎస్ ఎన్ హెచ్ ఆర్ మిడ్ డే మీల్ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి  స్కీములకు బడ్జెట్ కేటాయించకుంఢ్ఢడా నిర్వీర్యం  చేస్తున్నది పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు ఉద్యోగ భద్రత కార్మిక చట్టాలు కనీస వేతనాలు అమలు చేయకుండా పెట్టి చాకిరి చేయించుకుంటున్నదని దీనితోపాటు నిత్యవసర వస్తువుల ధరలు పెట్రోలు డీజిల్ ధరలు పెంచుతూ కార్మిక వర్గం మీద భారాలు మోపుతున్నదని  తరబడిగా  అంగన్వాడీ ఆయాలకు టీచర్లకు ఇతర రంగాల కార్మిక వర్గానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా చేయించుకుని ఉత్తచేతుల ఇంటికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నదని ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులు ప్రజలు వ్యతిరేకించాలని ఈనెల 10వ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డే  ను  కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిల్వర్ రమాకుమారి నాయకులు లక్ష్మి, హేమలత, కుష్మ లలితలు పాల్గొన్నారు.