దాశరధికి యూత్‌ ఐకాన్‌ అవార్డు

దాశరధికి యూత్‌ ఐకాన్‌ అవార్డుక్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ దాశరథి నరసింహన్‌కు అమైది తమిళ్‌ వర్శిటీ యూత్‌ ఐకాన్‌ అవార్డు లభించింది. నౌకాదళంలో పనిచేసిన ఆయన సినిమాలపై ఉన్న ఆసక్తితో 2016లో చిత్రరంగ ప్రవేశం చేశారు. వెంకటేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘చెన్నై 600028-2’ చిత్రంలో నటించారు. బ్యాడ్‌బార్సు బృందంలో ఒకరిగా నటించారు. తర్వాత ‘కణ’, ‘ఆర్కే నగర్‌’, ‘100’ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. రజనీకాంత్‌ అతిథి పాత్రలో పాత్రలో నటించిన ‘లాల్‌ సలామ్‌’ చిత్రంలో విష్ణు విశాల్‌కు మిత్రుడిగా నటించారు. ప్రస్తుతం అజిత్‌ హీరోగా నటిస్తున్న ‘విడాముయర్చి’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.