
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రైతాంగా పోరాటాలకు, తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమాలకు దాశరథి చేసిన పోరాటాలు, రచనలే స్ఫూర్తి అని ఆయన ఆశయ సాధన కు కృషి చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దాశరథి కృష్ణమాచార్యుల 99వ జయంతి ముగింపు వేడుకల సందర్బంగా తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారులు, మేధావులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దొరలు, జమిందారులకు, నిజాంకు వెతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారని అన్నారు. మొదట కమ్యూనిస్ట్ గా తరువాత కాంగ్రెస్ లో నిజాంపై పోరాటం సాగించాడని తెలిపారు.”ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బానలమేంతో “అనే చైతన్య పాటలను, రుద్ర వీణ, తిమిరం తో సమరం అనే కవిత లను రచించాడన్నారు. దాశరథి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు. టీపీసీసీ సభ్యులు, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, స్ఫూర్తి అధ్యక్షులు పందిళ్ల శంకర్, రచయిత వడ్డేపల్లి మల్లేశం, యాదవ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్,మాలమహానాడు రాష్ట్ర భాద్యులు వెన్న రాజు, ఉపన్యాసకుడు ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ ,అడ్వకేట్ పొన్నాల ఫ్రాన్సిస్, మైదాంశెట్టి వీరన్న, గడిపే కొమురయ్య, గడిపే బాలు, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, మాటేటి శ్రీనివాస్, ఆంజనేయులు, నాంపల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.