– దాసి సుదర్శన్ కు ఘనంగా నివాళి
నవతెలంగాణ – నాగార్జునసాగర్
దాసి సుదర్శన్ నిరాండంబర వ్యక్తి అని మాజీ ట్రైకర్ ఛైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ అన్నారు .నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని స్థానిక గ్రంథాలయంలో బుధవారం నాడు కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో ప్రముఖ చిత్రకారుడు కళాకారుడు ,సీనియర్ పాత్రికేయులు, జాతీయ అవార్డు గ్రహీత దాసి సుదర్శన్ సంస్కరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ట్రైకార్ చైర్మన్ రాం చందర్, సమూహ సెక్యులర్ రైట్స్ ఫోరం జిల్లా కన్వీనర్ ప్రభాకర్ హాజరయ్యారు. సమావేశంలో ముందుగా దాసి సుదర్శన్ సతీమణి స్వతంత్ర సుదర్శన్, సుదర్శన్ అభిమానులు, శ్రేయోభిలాషులు సుదర్శన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పలువురు మాట్లాడుతూ…దాసి సుదర్శన్ గా ప్రసిద్ధులైన మిర్యాలగూడలో ప్రముఖ ఆర్టిస్ట్ గా, సాహితీవేత్తగా సురపరిచితులైన సుదర్శన్ నాగార్జునసాగర్ జూనియర్ కాలేజ్ లో డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తూ, ఎంతోమంది విద్యార్థులను కళల వైపు, సాహిత్యం వైపు మళ్లించి ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత ఆయనకే దక్కింది. ఆర్టిస్టుగా, సాహితీవేత్తగానే కాకుండానే ఆయన జర్నలిస్టుగా కూడా వివిధ పత్రిక ల్లో వ్యాసాలు, వార్తలు రాస్తూ ప్రజ్ఞ పాటవాలను నిరంతరం ప్రకటిస్తుండేవారు సుదర్శన్ ఆయన విదయ వివిధ ప్రజ్ఞ పాటలతో సినిమా రంగాన్ని కూడా ఆయన సులపరిచితులే.
ప్రముఖ దర్శకులు కళాకారులు బి నర్సింగరావు తీసిన అనేక సినిమాలకు ఆయన కళాదర్శకుడిగా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. నర్సింగరావు తీసిన దాసి సినిమాకు అందుకున్న ఐదు జాతీయ అవార్డులలో సుదర్శన్ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత జాతి అవార్డులు జూరీలు ఆయన సభ్యులుగా నియమితులయ్యారు. ఇలా అనేక రంగాలలో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన సుదర్శన్ తన 72 ఏటా తను చాలించారు ఆయన అభిమానులకు శిష్యులకి మిగతా సాయిచి మిత్రులందరికీ తట్టుకోలేనితన సేవల్ని అందించారు ఆయన గురుత్వంలో అనేకమంది శిష్యులు తయారయ్యారన్నారు. పిట్టంపల్లి సుదర్శన్ దాసి సినిమా కు జాతీయ అవార్డు పొందిన తర్వాత తన ఇంటి పేరు దాసి సుదర్శన్ గా మారిపోయిందని అన్నారు. దాసి సుదర్శన్ ప్రముఖ ప్రజ్ఞాశాలి అని ఒక కళాకారుడుగా, చిత్రకారుడుగా, సాహితీవేత్తగా, రచయితగా, పాత్రికేయులుగా నాగార్జునసాగర్కు సేవలు అందించిన నిరాడంబర వ్యక్తి దాసి సుదర్శనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మట్టి మనిషి పాండురంగారావు, మాజీ ట్రైకర్ చైర్మన్ రామచంద్రనాయక్, టీఎన్జీవో స్థానిక అధ్యక్షులు రాములు, సంజీవయ్య ,రామ్మోహన్ రాజు ,పాత్రికేయులు పున్న కృష్ణమూర్తి, జర్నలిస్ట్ పిట్టంపల్లి హరికృష్ణ, మున్నా ,స్వతంత్ర, రాందాస్ , స్థానిక పాత్రికేయులు శర్మ , శ్యాం కుమార్ , అప్పారావు, నామలింగయ్య ,సత్యనారాయణ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.