
నవతెలంగాణ_తుర్కపల్లి
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల , సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీని పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి అన్నారు. సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 40 కంప్యూటర్ల ద్వారా డేటా ఎంట్రీని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డేటా ఆపరేటర్స్ ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యుమరేటర్స్ సహకారంతో ఖచ్చితమైన సమాచారాన్ని కంప్యూటర్లో నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈనెల 25,26 తో ముగుస్తుందని తెలిపారు. ఇప్పటివరకు సర్వే చేయించుకొని వారు సంబంధిత గ్రామపంచాయతీ, ఎంపీడీవో కార్యాలయాన్ని సంప్రదించి సర్వే చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎంపీఓ వెంకటేశ్వర్లు ,సూపరిండెంట్ జే వినోద్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అశోక్, శ్రీనివాస్ ఏ ఈ లు అనంతరెడ్డి, మనోహర్ బాబు, ఏవో ఉమాశ్రీ, డిప్యూటీ తహసిల్దార్ కల్పన ,ఆర్ఐ జహంగీర్, కంప్యూటర్ డేటా ఆపరేటర్స్ పాల్గొన్నారు