నవతెలంగాణ-మధిర
ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లూరు గ్రామంలో పత్తేపరుపు కన్నమ్మ (90) వయో భారంతో బుధవారం మరణించారు. మృతురాలికి నలుగురు కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె అయిన అవునూరి వెంకట రమణ తల్లికి తల కొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించి కన్నతల్లి రుణం తీర్చుకున్నది.