హైదరాబాద్ : చక్కెర ఉత్పత్తి కంపెనీ దావంగెరె 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 144.11 శాతం వృద్థితో రూ.5.61 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2.30 కోట్ల లాభాలు నమోదు చేసింది. కాగా ఇదే సమయంలో రూ.93.07 కోట్లుగా ఉన్న అమ్మకాలు.. గడిచిన త్రైమాసికంలో 15.85 శాతం తగ్గి రూ.78.31 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ బోర్డు సమావేశంలో వ్యర్థ మొలాసిస్ కిణ్వ ప్రక్రియను ధృవీకృత కార్బన్ డైయాక్సైడ్, డై ఐస్‌గా మార్చడానికి రూ.3 కోట్లతో ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారని ఆ సంస్థ పేర్కొంది.