బెంగళూరు : ప్రముఖ చక్కెర, ఇథనాల్ ఉత్పత్తి కంపెనీ డవంగెరి షుగర్ తన సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ రూ.54 కోట్లతో డిస్టిల్లరీ సామర్థ్యాన్ని ప్రతీ రోజు 45 కేఎల్‌పీడీకి చేర్చనున్నట్టు వెల్లడించింది. దీంతో తమ కార్యకలాపాల సామర్థ్యం మరింత పెరగనుందని ప్రకటించింది. ఇప్పటికే సివిల్ వర్క్స్ కోసం రూ.2 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. విస్తరణ వల్ల 15వేల ఎకరాల్లో చెరుకు పండించడం ద్వారా స్థానిక రైతులతో సంబంధాలు మరింత పెరగడానికి ఇది దోహదం చేయనుందని డీఎస్‌సీఎల్ ఎండీ గణేస్ తెలిపారు. బుధవారం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్ 9.72 శాతం పెరిగి రూ.9.93 వద్ద ముగిసింది.