దియాగా సంయుక్త

Dayaga Samyuktaహీరో శర్వానంద్‌ నటిస్తున్న తన 37వ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ‘సామజవరగమన’తో బ్లాక్‌బస్టర్‌ అందించిన రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిలేరియస్‌ రైడ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంయుక్త పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, పోస్టర్‌ ద్వారా ఆమె పాత్రను దియాగా పరిచయం చేశారు మేకర్స్‌. సంయుక్త సంప్రదాయ శాస్త్రీయ నృత్యం చేస్తూ కనిపించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీతం : విశాల్‌ చంద్ర శేఖర్‌, సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్‌, కథ : భాను బోగవరపు, డైలాగ్స్‌ : నందు సావిరిగాన, ఆర్ట్‌ : బ్రహ్మ కడలి.