నవతెలంగాణ-ధర్మసాగర్
వర్గీకరణ కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిటిక్ బ్యూరో సభ్యులు బోడ్డు దయాకర్ అన్నారు. బుధవారం మండల కేంద్రములోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి బొడ్డు శాంతి సాగర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జాతీయ పోలిటిక్ బ్యూరో సభ్యులు బొడ్డు దయాకర్ మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ పాల్గొని మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ 29 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని అన్నారు.ఈ తరుణంలో మాదిగ ,మాదిగ ,ఉపకులాల వారిని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలించి ఇంతటి సుదీర్ఘమైన దండోర ఉద్యమానికి న్యాయమైన ముగింపును సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.రాజ్యాంగ ఫలాలుగా అందుతున్న ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీలో ఉన్న అన్ని కులాల ప్రతిపాడికన లభించాలి అనేదే దండోరా ఉద్యమం ఆశయమని చెప్పారు.జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ లేకపోవడం వలన మాదిగ,ఉపకులాల వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం చివరి ఘట్టానికి చేరుకుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బుర్ర బిక్షపతి, ఎమ్మెస్ పి జిల్లా కన్వీనర్ గంగారపు శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ గద్దల సుకుమార్, ఎమ్మెస్ పి మండల్ ఇన్చార్జి పోలిశెట్టి ప్రతాప్, చింత శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు రొండి రాజు యాదవ్,బొడ్డు శోభా సోమయ్య, బొడ్డు వాసుదేవ్,నిమ్మ సుదర్శన్ రెడ్డి, వక్కల రవి, తోకల రాజేందర్ రెడ్డి, బొడ్డు ప్రదీప్ కుమార్, చాడ కుమార్, రేమిడి మహేందర్ రెడ్డి, కొలిపాక రమేష్,బొడ్డు ఆల్బర్ట్, కొలిపోక మల్లిక్, మంద సుగుణయ్య, కొట్టే చార్లీ, బొల్లం సాంబరాజు, చిట్యాల కుమార్, పొడిశెట్టి సురేందర్, కొట్టే కళ్యాణ్, చిలక రాజు, సోంపల్లి అన్వేష్, గంగారాపు వినీత్, మాచర్ల బాబు, కనకం శేఖర్, తదితరులు పాల్గొన్నారు.