కార్యకర్త మరణంతో కంటనీరు పెట్టిన దయన్న

నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని సన్నూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిమాని కోలా రామ్మూర్తి అనారోగ్య కారణంతో అకాల మరణం చెందిన విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి విచ్చేసి రామ్మూర్తి భౌతిక కాయానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మృతునితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకొని కంటనీరు పెట్టారు. రామ్మూర్తి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. తదుపరి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తి అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. పార్టీ బలోపేతం కోసం రామ్మూర్తి చేసిన కృషి మరువలేనిది అని గుర్తుకు చేశారు. ఆయనతోపాటు సర్పంచ్ నలమాస సారయ్య, మండల  ఇంచార్జి గుడిపూడి గోపాల్ రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.