– జహీరాబాద్ పార్లమెంట్ ఫలితం పై ఉత్కంఠ
– మేమంటే మేమే గెలుస్తామంటూ ఉత్సాహంగా బయలుదేరిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు..
నవతెలంగాణ – మద్నూర్
భారతదేశంలో లోక్సభ ఎన్నికలు దాదాపు రెండు నెలలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఏడు విడతల్లో కొనసాగిన ఎన్నికల ఫలితాలకు రోజులు గడిచాయి. గంటలే మిగిలాయి జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక పట్ల ఉత్కంఠ నెలకొంది ఈ ఎన్నికపై ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీల నాయకులు మేమంటే మేమే గెలుస్తామంటూ ఈ నెల నాలుగున మంగళవారం నాడు సంగారెడ్డి జిల్లా లో జరిగే కౌంటింగ్ కోసం ఇరుపార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు సోమవారం బయలుదేరి వెళ్లారు. లోక్సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్ విడుదల చేయగా జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ గెలుస్తుందని సర్వేలు తెలపడం, ఆ పార్టీ నాయకుల్లో ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటూ ఆ పార్టీ నాయకులు ఆనందోత్సవాల మధ్య కౌంటింగ్ కోసం సంగారెడ్డికి బయలుదేరారు. జుక్కల్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు సొంత నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ సెట్కారుకు నారాయణఖేడ్ సెగ్మెంట్ సొంత నియోజకవర్గం కావటం విశేషం. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా కామారెడ్డి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు జుక్కల్ బాన్సువాడ ఎల్లారెడ్డి కామారెడ్డి మిగతా మూడు నియోజకవర్గాలు సంగారెడ్డి జిల్లా ప్రాంతానికి చెందిన జహీరాబాద్ నారాయణఖేడ్ ఆందోల్ ఈ ఏడు నియోజకవర్గాలలో పోలైన ఓట్ల లెక్కింపు ఈ నెల నాలుగున మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. లోక్సభ ఫలితం కోసం కొన్ని రోజులుగా ప్రజలు ఆయా పార్టీల నాయకులు ఎదురుచూసే సమయం రోజులు గడిచాయి. ఇక గంటలే మిగిలాయి. కొన్ని గంటల సమయంలోనే గెలుపు ఓటమి లపై ఫలితం రాబోతుంది. గంటల వ్యవధిలోనే రాబోయే ఫలితం ఏ పార్టీకి అనుకూలమో మంగళవారం నాడు తేలనుంది. ఏది ఏమైనా జహీరాబాద్ పార్లమెంట్ గెలుపు పట్ల బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పట్టు బిగించాయి ఫలితం ఎవరికి వరిస్తుందో వేచి చూడాలి.