హైదరాబాద్: బ్రిటీష్ అల్ట్రా లగ్జరీ స్పోర్ట్స్ కార్ దిగ్గజం ఆస్టన్ మార్టిన్ శనివారం హైదరాబాద్‌లో తన డిబి 12 కుపేను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 4.59 కోట్లుగా ఉంటుందని ఆస్టన్ మార్టిన్ సేల్స్, బ్రాండ్ మేనేజర్ జై మెహ్రా తెలిపారు. 2023లో ఆస్టన్ మార్టిన్ డిబి12, మార్పును కలిగించే నిజమైన మోడల్ రాకతో ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉంటుందని అన్నారు. 1928లో తొలిసారి తమ కారు భారత్‌కు దిగుమతయ్యిందని పేర్కొన్నారు.