ఆయిల్ ఫాం సాగు దారులకు ఆర్థిక చేయూత: డీసీసీబీ సీఈఓ ఏఆర్ రహ్మాన్  

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం సాగు దారులకు పంట పెట్టుబడి కి ఋణాలు అందించడం ద్వారా ఆర్థిక తోడ్పాటును అందించాలని ప్రభుత్వ విధానం ప్రకారం ప్రత్యేకంగా ఋణాలు మంజూరు చేస్తుందని డీసీసీబీ సీఈవో ఏ ఆర్ రహ్మాన్ తెలిపారు.రుణాలను సద్వినియోగం చేసుకుని సకాలంలో వాయిదాలు ను చెల్లించాలని సూచించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం పంచాయితీ పరిధిలోని రైతు వేదికలో బుధవారం డీసీసీబీ అశ్వారావుపేట బ్రాంచ్ మేనేజర్ ఆర్.అనూష పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన పామాయిల్ రైతుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట ఋణం క్రింద రూ. 1 లక్ష వరకు రుణం మంజూరు చేస్తామని ఇందుకు 7 శాతం వడ్డీ లో 3 శాతం కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందని, మిగతా 4 శాతం రైతులు చెల్లించాలని వివరించారు. అదేవిధంగా నాబార్డు నుండి కొత్తగా సాగు చేసుకునే రైతులకు నాలుగేళ్ళ పాటు ఎకరాకు రూ.1.35 లక్షలు రుణం క్రింద అందించ నుందని, ఇందుకు రూ.0,32 వరకు వడ్డీ ఉంటుందని, దీనికి ఎటువంటి వడ్డీ రాయితీ ఉండదని చెప్పారు.డీసీబీ బ్యాంక్ ఎకరాకు రూ.50 వేల చొప్పున రుణం మంజూరు చేస్తుందని, రూ.3 లక్షల వరకు సుమారు రూ.0.20 పైసలు, రూ.3 లక్షల నుండి రూ.10 లక్షల వరకు రుణం తీసుకుంటే రూ.1 వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని, వ్యవసాయ భూమిని మార్టిగేజ్ చేసే రైతులకు ఎకరాకు రూ.4 లక్షల వరకు రుణం మంజూరు చేస్తామని,ఓ డీ పద్దతిన కూడా అమలు చేస్తామని తెలిపారు. ఓడి పద్ధతిలో రైతు వినియోగించుకున్న రుణ సొమ్ముకు మాత్రమే వడ్డీ చెల్లించాలని,ఈ పద్ధతి రుణానికి కూడా ఎటువంటి వడ్డీ రాయితీలు ఉండవని చెప్పారు.రైతులు మాత్రం అత్యధికంగా ఎసైన్మెంట్  భూములే ఉన్నాయని,వాటిని మార్ట్ గేజ్ చేయటం సాధ్యం కాదని,ఎసైన్మెంట్ భూములకు కూడా రుణాలు మంజూరు చేయాలని రైతులు కోరారు. ఈ సూచనపై ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని,ఇచ్చిన రుణానికి రైతు నుండి కనీస గ్యారంటీ లేకుండా పెద్ద మొత్తంలో రుణం ఇవ్వటం కుదరదని సూచనప్రాయంగా వివరించారు.ఇతర బ్యాంకుల కంటే మెరుగైన రుణ సదుపాయం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందని పలువురు రైతు సంఘం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య,దండు రామరాజు,తుమ్మ రాంబాబు,ఆళ్ళ నాగేశ్వరరావు,బత్తిన పార్ధసారధి సీఈవో కు విజ్ఞప్తి చేశారు. రైతులు లేవనెత్తిన సమస్యలపై డీసీసీబీ పాలకవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఈవో హమీ ఇచ్చారు. సమావేశంలో డీసీసీబీ ఏ జీఎం అజయ్ రెడ్డి,డైరెక్టర్ నిర్మల పుల్లారావు,అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,పూర్వ అద్యక్ష ఉపాధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవ రావు,సుంకవల్లి వీరభద్రరావు, సొసైటీ సీఈఓ మానేపల్లి విజయ్ బాబు,కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, అచ్యుతాపురం,గుర్రాల చెరువు,ఊట్లపల్లి,గంగారం,జమ్మి గూడెం,పేరాయిగూడెం డైరెక్టర్ లు తెల్ల మేకల కన్నయ్య,కలపాల మహాలక్ష్మి,బత్తిన పార్ధసారధి,అల్లూరి వెంకటరామారావు,చిట్టి బాబు,కలపాల బాబురావు లు పాల్గొన్నారు.