కొండపర్తిలో డిసిసిబి చైర్మన్ ప్రచారం

నవతెలంగాణ – ఐనవోలు: వర్దన్నపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరూరి రమేష్ ని గెలిపించాలని  కొండపర్తి గ్రామంలోఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మర్నెని రవీందర్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరూరి ని  గెలిపించుకొని వర్ధన్నపేట నియోజకవర్గంను మరింత అభివృద్ధి వైపు నడిపించాలన్నారు. డీసీసీబీ చైర్మన్  వెంట జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్రావు, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు శంకర్ రెడ్డి రాజశేఖర్, గుడి చైర్మన్ మజ్జిగ జైపాల్, కొండపర్తి సర్పంచ్ రాజమణి బెన్షన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.