చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించిన డిసిఇబి కార్యదర్శి సీతయ్య

నవతెలంగాణ – కంటేశ్వర్

మానసిక అంగవైకల్యా విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత ఎంతో అవసరమని చదువు యొక్క ప్రాముఖ్యతను క్లుప్తంగా విద్యార్థిని విద్యార్థులకు బిసిఇబి కార్యదర్శి బి సీతయ్య వివరించారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ ఆవరణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు చదవుపై ప్రాముఖ్యతపై పలు అంశాలను క్లుప్తంగా వివరించి మెలకువలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మానసిక అంగవైకల్యా విద్యార్థిని విద్యార్థులతోపాటు కన్స్ట్రక్షన్ కార్యదర్శి సిద్దయ్య ప్రిన్సిపల్ జ్యోతి తోపాటు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.