పెర్కిట్ విజేత అపార్ట్మెంట్ దగ్గర డీసీఎం బోల్తా

నవతెలంగాణ- ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ విజేత అపార్ట్మెంట్ ముందర శుక్రవారం రాత్రి వడ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం డివైడర్ను  ఢీకొని బోల్తా పడింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.