నవతెలంగాణ – బంజారా హిల్స్: బేగంపేట ఫ్లైఓవర్ పై డిసిఎం బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో సికింద్రాబాద్ నుండి మహిదీపట్నం వైపు వెళ్తున్న డిసిఎం, అధిక వేగంతో వెళుతూ అదుపుతప్పి బేగంపేట్ నుంచి పంజాగుట్టకూ కూత వేటు దూరంలోనే ఉండగానే డివైడర్ను ఢీకొనీ ముందు చక్రాలు విరిగిపడిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ముందు ప్రయాణిస్తున్న వాహన చోదకులు అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ముందుగా ట్రాఫిక్ ని సజావుగా వెళ్ళేటట్టు చేసి ఊడి పడిపోయిన చక్రాలను డీసీఎంను క్రేన్ సహకారంతో తరలించారు.
అనంతరం డ్రైవర్ కు ప్రాథమిక విచారణ చేపట్టి మద్యం సేవించినట్లు టెస్టు నిర్వహించి మద్యం సేవించలేదని తేలడంతో ప్రమాదానికి కారణం డ్రైవర్ కి నిద్ర లేనట్లు గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సరిగ్గా మాంసం రోజుల క్రితం ఇదే ఫ్లైఓవర్ పై ఓ పోలీస్ అధికారి తన కూతుర్ని తీసుకొని సికింద్రాబాద్ నుంచి సోమాజిగూడ లోని ఆసుపత్రికి వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన కూతురు అక్కడికక్కడే మృతిచెందగా ఆయన ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇలా వరుస ఘటనలకు కారణమవుతున్న అతివేగానికి ట్రాఫిక్ పోలీసులు చెక్ పెట్టే యువజనలో ఉన్నట్లు సమాచారం.