పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు టైలరింగ్ పనులను పూర్తి చేయాలి: డీసీఎం సంధ్య

నవతెలంగాణ : రెంజల్

పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు మండలంలోని అన్ని స్కూళకు ఎక రూప దుస్తులను అందేలా చర్యలు తీసుకోవాలని డీసీఎం సంధ్య స్పష్టం చేశారు. ఈ నెల 12 లోపు విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు అందేలా చూడాలని ఐకెపి ఏపిఎం చిన్నయ్యను ఆదేశించారు. సోమవారం ఐకెపి కార్యాలయంలో టైలరింగ్ మహిళలకు అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. డ్రెస్సులు కుట్టే సమయంలో దూరం కాకుండా దగ్గర దగ్గర వచ్చేలా చూడాలని వారికి సూచించారు. ప్రతి పాఠశాలలో ఎంతమంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో ప్రతి సి ఏ కి అవగాహన ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితులలోను 13వ తారీఖున ప్రతి విద్యార్థి ఏక రూప దుస్తులతో పాఠశాలలకు రావాలని ఆమె సీఏలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం చిన్నయ్య, సీసీ భాస్కర్, శివకుమార్, కృష్ణ, రాజయ్య, శ్యామల, సునీత, కంప్యూటర్ ఆపరేటర్ తస్లీమా తదితరులు పాల్గొన్నారు.