నవతెలంగాణ – కామారెడ్డి
వడ్ల కొనుగోలు అయినా మూడు నాలుగు రోజులలో డబ్బులు రైతుల అకౌంట్లో పడటంతో జిల్లాలోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కామారెడ్డి జిల్లా డిసిఓ రామ్మోహన్ అన్నారు. బుధవారం జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ సొసైటీ పరిధిలోని కొండాపూర్ ఎల్లారెడ్డిపల్లి, సిద్ధాపూర్ సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. వడ్లను తమ శాతం చూసి కొనుగోలను వేగవంతం చేయాలని సొసైటీ కార్యదర్శులకు సూచించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాన్యం కొనుగోలు కొద్దిగా ఆలస్యమైనా గత సంవత్సరం ఈ సమయానికి కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువగానే వాళ్లను కొనుగోలు చేయడం జరిగిందని దాంతో పాటు డబ్బులను సైతం వేయడం జరిగిందన్నారు. సన్నం వడ్లకు బోనస్ సైతం ఇప్పటివరకు 50 శాతం వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సొసైటీల కార్యదర్శులు రైతులు పాల్గొన్నారు.