నవతెలంగాణ-మంచిర్యాల
పాత నేరస్తులు తమ పద్ధతి మార్చుకోవాలని డీసీపీ భాస్కర్ అన్నారు. గంజాయి అమ్ముతూ పట్టుబడి పలు కేసుల్లో నిందితులుగా ఉన్న నేరస్థులకు డీసీపీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు గతంలో గంజాయి అమ్ముతూ పట్టుబడి పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. ఇప్పటికైనా అసాంఘిక కార్యకలాపాలు మానుకొని మంచి నడవడికతో జీవించాలని సూచించారు. పద్ధతి మార్చుకోని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. జిల్లాలోని నేరస్థులపై పోలీసులు నిఘా పెట్టారని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ ఆర్.ప్రకాష్, సీఐ బన్సీలాల్ పాల్గొన్నారు.