సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన డీసీపీ రాజేష్ చంద్ర

నవతెలంగాణ -వలిగొండ రూరల్:  మండలంలోని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర గురువారం పరిశీలించారు. ఈ నెల 30వ తేదిన జరగనున్న  శాంతి భద్రతల్లో భాగంగా మండలంలోని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించ బడిన సంగెం, టేకులసోమారం, వలిగొండ, గోకారం, దాసిరెడ్డిగూడెం గ్రామాల్లో గురువారం పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల అధికారులతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ మొగులయ్య, రామన్నపేట సీఐ మోతిరాం, స్థానిక ఎస్సై ప్రభాకర్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.