లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న డీసీపీ

నవతెలంగాణ – భీంగల్
మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్టపై గల లక్ష్మీనరసింహస్వామిని డీసీపీ జయరాం సతీ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు  గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను గురించి డిసిపి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకుడు నంబి పార్థసారథి డీసీపీను సన్మానించారు. డీసీపీ వెంట భీంగల్ ఎస్సై హరి బాబు ఉన్నారు.