మండలంలోని పొనకల్ పంచాయతి పరిదిలోగల వీర్ల గుట్టపై ఈనెల 19న జరగనున్న కేతీశ్వర కంకలమ్మ శివాలయం జాతరకు సంబందించిన కరపత్రాలను ఆదివారం మంచిర్యాల్ డిసిపి. ఎగిడి భాస్కర్, మంచిర్యాల ఏసిపి ప్రకాష్ లతో పాటు లక్షెట్టిపేట్ సీఐ అల్లం నరేందర్ లను వేరువేరుగా ఆవిష్కరించారు. ఈ కంకలమ్మ జాతరకు హజరు కావాలని ఆలయ కమిటి నిర్వాహకులు డిసిపి, ఏసిపి ల తో పాటు లక్షెట్టిపేట్ సిఐ అల్లం నరేందర్ లను “వేరు వేరుగా కలిసి ఆహ్వాన పత్రం అందజే కోరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతర కు తప్పకుండ వస్తామని దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఏలాటి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసులకు తెలియా చేయాలన్నారు. కరపత్రాల విడుదల కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు చిలు వెరీ నర్సయ్య, పర్ల కనకయ్య, సంద కృష్ణ , పిల్లిరవి, చిలువేరి సుదీర్ ఉన్నారు .