భువనగిరి యాదాద్రి జిల్లా జిల్లాకేంద్రంతో పాటు చుట్టూ ఉన్న మండలాలలో బీసీ సంక్షేమ హాస్టల్ లను ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈబీసీ మైనార్టీ అన్ని వర్గాల పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటారని అన్ని బీసీ విద్యార్థి సంఘం నాయకులు వేముల అనిల్ ,బాలాజీ నాయక్, గుండెబోయిన శంకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో డిడి యాదయ్య కి వినతిపత్రం అందజేశారు . బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ బస్ అవకరం లేక ఆర్థికంగా లేక విద్యకు దూరమవుతున్నందున నూతన సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్య అందించాలి జిల్లాలో ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఫార్మసీ పాలిటెక్నిక్ మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులు పెరగడంతో ఇప్పుడున్న హాస్టల్లు సరిపోనందున మరి కొన్ని నూతన హాస్టల్స్ ను మంజూరు చేయాలని అలాగే స్కూల్లో చదువుకునే విద్యార్థులకు చిన్న పిల్లల హాస్టల్లు ఏర్పాటు చేయాలని కోరారు రామన్నపేట చౌటుప్పల్ ఆలేరు, మోత్కూర్, వలిగొండ, బొమ్మలరామారం, మండల కేంద్రాలలో అవసరాన్ని దుష్ట హాస్టల్ పెంచాలని కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల కోసం మరికొన్ని హాస్టల్ లను ఓపెన్ చేస్తామన్నారు . ఈ సమావేశంలో వేముల అనిల్ ,భూక్య సంతోష్ నాయక్,గుండెబోయిన శంకర్ లు పాల్గొన్నారు.