ఆరో తరగతి ప్రవేశాలకు 23వరకు గడువు పెంపు 

నవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి ప్రవేశాలకు నేటితో గడువు ముగియడంతో దానిని సెప్టెంబర్ 23 వరకు పెంచుతున్నట్లు విద్యాలయ ప్రిన్సిపల్ సత్యవతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష 18 జనవరి 2025న నిర్వహించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. Https://navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె అన్నారు. నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల పిల్లలకి 75% సీట్లను భర్తీ చేయడం జరుగుతుందని ఇట్టి అవకాశాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గ్రామీణ ప్రాంత విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని ఆమె తెలిపారు.