ప్రాణాంతకంగా…ఆహార నాణ్యత!

Lethal...the quality of the food!ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రతీ ఏడాది వివిధ రాష్ట్రాల్లో పాటిస్తున్న ఆహార ప్రమాణాలను పరిశీలిస్తుంది. పెద్ద, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేటగిరీలుగా విభజించి..
2018 నుంచి ఫుడ్‌ సేఫ్టీలో రాష్ట్రాల వారీగా ర్యాంకింగ్‌ ను కేటాయిస్తున్నది. 2020-21లో విడుదల చేసిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం 36 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. 2021-22లో 20 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 15వ స్థానంలో నిలిచింది. మొత్తం ఐదు కొలమానాల్లో వంద పాయింట్స్‌కు గాను రాష్ట్రానికి కేవలం 34.5 పాయింట్సే వచ్చాయి. 2022-23లో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది.
ఇటీవల ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ బృందం సభ్యులు హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి అక్కడ ఫుడ్‌ సేఫ్టీ రూల్స్‌ పాటించడం లేదని గుర్తించారు. స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్మే ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి వారికి కనిపించింది. పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాలలు ఉన్నట్లు నిర్ధారించారు. 40కి పైగా హోటళ్లపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌ లోనే కాదు.. తెలంగాణలోని అన్ని పట్టణాల్లో ఇలాంటి పరిస్థితే ఉన్నది. ఇది ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నది.
ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రకారం హోటళ్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. వంటశాల పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పక్కాగా డ్రెయినేజీ వ్యవస్థ ఉండాలి. వంటపాత్రల నుంచి వంట చేసే వ్యక్తి, వడ్డించే వారు పరిశుభ్రత పాటించాలి. అంటువ్యాధులు లేవని వారు వైద్యుల నుంచి ధ్రువీకరణ పొందాలి. ప్రతిహోటల్‌కు లైసెన్సు తప్పనిసరి. కానీ చాలా హోటళ్లు నిబంధనలు పాటించడం లేదు. ఒక రిజిస్ట్రేషన్‌తోనే ఆ చుట్టు పక్కల రెండుమూడు హోటళ్లు నడుపుతున్నారు. దీంతో హోటళ్లలో కలుషిత ఆహారం వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీర్ఘకాలం పాటు కలుషిత ఆహారం తింటే జీర్ణకోశం పాడైపోవడం, చూపు మందగించడం, కీళ్ల నొప్పులు, క్యాన్సర్‌, గుండెపోటు, పక్షపాతం వంటి రోగాలు వచ్చే ప్రమాదమున్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. కలుషిత ఆహారం తినడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 60 కోట్ల మంది అనారోగ్యం పాలవుతున్నారు. 4.2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో 40 శాతం ఐదేళ్ల లోపు చిన్నారులే ఉంటున్నారు. ఇంటి భోజనాన్ని కాదని బయట ఫుడ్‌ తినే ప్రతి 10 మందిలో కచ్చితంగా ఒక్కరైనా తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో పలు దేశాల్లో నిర్వహించిన సర్వే ద్వారా స్పష్టం చేసింది. భారత దేశ సగటు ఆయుర్దాయం 69 సంవత్సరాలు కాగా, చైనాలో అది 76 గా, అమెరికాలో 79 గా ఉంది. కల్తీ ఆహారం వల్లే దేశ ప్రజల ఆయు ప్రమాణం పెరగడం లేదనే చర్చ జరుగుతున్నది.ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రతీ ఏడాది వివిధ రాష్ట్రాల్లో పాటిస్తున్న ఆహార ప్రమాణాలను పరిశీలిస్తుంది. పెద్ద, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేటగిరీలుగా విభజించి.. 2018 నుంచి ఫుడ్‌ సేఫ్టీలో రాష్ట్రాల వారీగా ర్యాంకింగ్‌ ను కేటాయిస్తున్నది. 2020-21లో విడుదల చేసిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం 36 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. 2021-22లో 20 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 15వ స్థానంలో నిలిచింది. మొత్తం ఐదు కొలమానాల్లో వంద పాయింట్స్‌కు గాను రాష్ట్రానికి కేవలం 34.5 పాయింట్సే వచ్చాయి. 2022-23లో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది.
2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ యాక్ట్‌ను తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదనిపిస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. స్థానిక మున్సిపల్‌ కార్పొ రేషన్‌, జీహెచ్‌ఎంసీ లోని ఫుడ్‌ సేఫ్టీ అధికారులను నేరుగా కలిసి కంప్లయింట్‌ ఇవ్వవచ్చు. diripmtg@ gmail.com, fssmutg@gmail.com కి మెయిల్‌ ద్వారా కూడా కంప్లయింట్‌ చేయొచ్చు. 91001 05795 నంబర్‌కి కాల్‌ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా foodsafetywing.ghmc@ gmail.com కు ఫిర్యాదు చేయవచ్చు.- జీహెచ్‌ఎంసీ పరిధిలో అయితే 040-21111111 నంబర్‌ కు లేదా diripmtg@ gmail.com, fssmutg@gmail.com మెయిల్‌ ద్వారా, ట్విట్టర్‌ అయితే diripmtg@ gmail.com, fssmutg@gmail.com కి ఫిర్యాదు చేయవచ్చు. ఆన్‌లైన్‌ ఆర్డర్లు తీసుకున్నప్పుడు కూడా వినియోగదారులకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఆ ఫుడ్‌ బిల్‌, ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ వివరాలతో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.ఫిర్యాదు వచ్చిన వెంటనే, ఆ ప్రాంత పరిధిలో ఉన్న ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సదరు హోటల్‌కు వెళ్లి తనిఖీ నిర్వ హిస్తారు. సేకరించిన వంటకాలను ల్యాబ్‌లకు పంపించి నివేదికను సదరు హోటల్‌ యజమానులకు పంపిస్తారు. ఆ నివేదికను సవాలు చేసుకునేందుకు హోటల్‌ యాజమాన్యానికి 30 రోజుల సమయం ఉంటుంది. నెల రోజుల్లో యజమానులు స్పందించని పక్షంలో సంబంధిత అడ్‌జ్యుడికేషన్‌ ఆఫీసర్‌ దగ్గర కేసు నమోదు చేస్తారు. అన్‌సేఫ్‌ (సురక్షితం కానివి) అని వస్తే క్రిమినల్‌ కోర్టులోనూ, సబ్‌ స్టాండర్డ్‌ అని వస్తే కేసు ఫైల్‌ చేస్తారు. సబ్‌ స్టాండర్డ్‌ (నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువ స్థాయి) వస్తే హోటల్‌ స్థాయి, ఆదాయం, సిబ్బందిని బట్టీ రూ. 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అన్‌సేఫ్‌ అని నివేదిక వస్తే ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు జరిమానా లేదా కోర్టు ద్వారా శిక్ష ఉంటుంది. ఒకే హోటల్‌ మీద పదే పదే ఫిర్యాదులు వస్తే.. వాటిని పరిశీలించి సదరు రెస్టారెంట్లు తగిన నివారణా చర్యలు తీసుకోకపోతే వాటి లైసెన్స్‌ కూడా రద్దు చేస్తారు.
మహమ్మద్‌ ఆరిఫ్‌
7013147990