డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి: భాగ్యలక్ష్మి

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్

మండలకేంద్రంలో విత్తన డీలర్ల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు.విత్తన స్టాక్‌ రిజిస్టర్లు, విత్తన కొనుగోలు, అమ్మకాల, బిల్లు బుక్‌లు తనిఖీ చేశారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధి కారి మాట్లాడుతూ రైతులు లూజ్‌ విత్తనాలు కొను గోలు చేయవద్దని అన్నారు. డీలర్ల దగ్గరనే విత్తన ప్యాకెట్లు కొనుగోలు చేయాలని, డీలర్లు రైతులకు విత్తన రసీదు, విత్తన రిజిస్ట్రేషన్‌ ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖ నుంచి పంపిన పట్టికను బోర్డుపై ఉంచాలన్నారు. రోజు వాడే అప్డేట్‌ డీలర్ల బోర్డుపై ఉంచాలని సూచించారు. విత్తన కొనుగోలు పై రైతులకు గ్రామపంచాయతీ పరిధిలో సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. కొనుగోలు పై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ప్రస్తుత వానాకాలం పంటల సాగుకు అవసరమైన విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు సరైన అవగాహన కలిగి ఉండాలని,తద్వారా భవిష్యత్తులో జరిగే పంట నష్టాలకు తగిన పరిహారాన్ని పొందవచ్చన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన ఆదిక త డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు.
నిర్ణీత ఫార్మాట్‌ లో ఉన్న బిల్లు (రసీదు) అనగా దుకాణదారుని అడ్రస్‌ పేరు సీడ్‌ లైసెన్స్‌ నంబరు జిఎస్టి నంబరు తది తరవి ఉన్న రసీదును మాత్రమే రసీదుగా ఇవ్వాలని సూచించారు. రసీదు పై విత్తన కంపెనీ పేరు విత్తన రకంపేరు, లాట్‌ నెంబరు,గడువు తేదీ మరియు డీలర్‌ సంతకము తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. లూజుగా ఉన్న సంచులు మరియు పగిలిన పాకెట్లు డబ్బాల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదు.గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితులలో కొనరాదని, కొను గోలు చేసిన విత్తన ప్యాకెట్‌ సంచి డబ్బాలపై సీలు ఉందా లేదా అని సరిచూసుకోవాలన్నారు. విత్తన పాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని బిల్లులో ఉన్న వివరాలతో సరిచూసుకోవాలన్నారు. బీటీ కాటన్‌ విత్తన ప్యాకెట్లపై జి ఈ ఏసీ అప్రూవల్‌ నెంబర్‌ తేదీ సదరన్‌ జోన్‌ అనగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయుటకు అనువైనదో కాదో విత్తన పాకెట్‌ పై ఉన్న సమాచారంలో సరి చూసుకోవాలన్నారు. విత్తన ప్యాకెట్ను బిల్లును పంట కాలం పూర్తయ్యేవరకు భద్రంగా దాచుకోవడం తద్వారా జన్యు స్వచ్ఛత లోపాల వల్ల లేదా మొలక శాతం తక్కువైనప్పుడు తగిన పరిహారం కోరే హక్కు రైతుకు ఉంటుందని పేర్కొన్నారు. ఆమెతోపాటు ఏవో నదిముద్దీన్ ఉన్నారు.