ఏప్రిల్‌ 12న తెలుగులో డియర్‌ రిలీజ్‌

ఏప్రిల్‌ 12న తెలుగులో డియర్‌ రిలీజ్‌జి.వి. ప్రకాష్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్‌’. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి చెందిన వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి పథ్వీరాజ్‌ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు గ్యాప్‌ ఉంది. తమిళ వెర్షన్‌ ఏప్రిల్‌ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్‌ ఏప్రిల్‌ 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఆంధ్ర థియేట్రికల్‌ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్‌ కొనుగోలు చేయగా, ఏషియన్‌ సినిమాస్‌ తెలంగాణ థియేట్రికల్‌ హక్కులను సొంతం చేసుకుంది. హ్యూజ్‌ థియేట్రికల్‌ చైన్‌ బిజినెస్‌లు ఉన్న ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థల బ్యాకింగ్‌తో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది. జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విశేష ఆదరణ పొంది, సినిమాపై అందరిలోనూ అంచనాలను పెంచాయి.