
నల్లగొండ ముద్దుబిడ్డ, పీడిత ప్రజల కోసం పోరుబాట చేసిన విప్లవ వీరుడు కోనపురి సాంబశివుడు 13వ వర్ధంతి పురస్కరించుకొని మంగళవారం భువనగిరిలో అమరవీరుల స్థూపం వద్ద శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్ట విరేష్ యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పుట్టా వీరేష్ యాదవ్ మాట్లాడుతూ.. సాంబశివుడు పెద ప్రజల కోసం తన జీవితం అంతా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రo కోసం పోరాడి అమరుడైన గోప్ప వ్యక్తి అని సాంబశివుడు చేసిన త్యాగానీ గుర్తించి అతని కుటుంబాన్నికి తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడు గుండబోయిన సురేష్ యాదవ్, జిల్లా కోఆర్డినేటర్ అవిశెట్టీ రమేష్ యాదవ్, రేకలా రమేష్ యాదవ్ పట్టణ అధ్యక్షుడు మర్రి పాండు యాదవ్, జిల్లా కుర్మ సంఘం నాయకులు ర్యాకల శ్రీనివాసు, నరాల రాజు యాదవ్ గుండ బొయిన నర్సింహ, యాదవ్ భువనగిరి మండలం అధ్యక్షుడు చుక్కలు శంకర్ యాదవ్, బాత్క అశోక్, శ్రీరామ్ శరత్ యాదవ్ రసాల లింగస్వామి యాదవ్, మల్లేష్,భుషబోయిన సిద్ధు పాల్గొన్నారు.