నవతెలంగాణ-చేగుంట: చేగుంట పట్టణ కేంద్రం మెదక్ రోడ్‌లో గాంధీ చౌరస్తా వద్ద సోమవారం బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి, పేదల పెన్నిధి, దివంగనేత సోలిపేట రామలింగారెడ్డి జన్మదిన శుభ సందర్భంగా కేకు కట్ చేసి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్, టిఆర్‌ఎస్ చేగుంట పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి, నాయకులు పల్లె క్రాంతి కుమార్, అన్నం రవి, కుర్ర లక్ష్మీనారాయణ ,జర్నల్ సింగ్, గుట్టాల నరేష్, అన్నం రవి, రాజేష్ ,మేకల జయరాములు పాల్గొన్నారు.