మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ప్రపంచ మృతిక దినోత్సవం కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి కే జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు మట్టి పరీక్షలను నిర్వహించే విధానాన్ని వివరించారు. మట్టి పరీక్ష చేయించాలనుకున్న సమయంలో రైతులు సాగు చేస్తున్న పంటలకు మీ వ్యవసాయ భూమిలో ఏ ఏ పోషకాలు ఏ ఏ మోతాదులో ఉన్నాయి తక్కువగా ఏ పోషకాలు ఎక్కువగా ఏ పోషకాలు ఉన్నాయి ఏ పోషకాల అవసరము ఆవశ్యకత ఎంత ఉన్నది అనేక విషయాలను ఈ మట్టి పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. రైతులు తమ వ్యవసాయ భూమిలో ఎకరం విస్తీర్ణంలో గట్లు చెట్లు రాళ్లు చెత్త పిచ్చి మొక్కలు లేని ప్రాంతంలో పారతో వి ఆకారంలో ఒక అడుగు లోతు గొయ్యి తీసి అంచుల వెంబడే పై నుండి కింది వరకు మట్టిని సేకరించాలి. ఈ ప్రకారంగా 8 నుండి 10 ప్రదేశాల్లో సేకరించిన మట్టిని నాలుగు భాగాలు చేసి ఎదురెదురు భాగాలను కలుపుతూ సుమారు 500 గ్రాముల మట్టిని ఒక కవర్లో ప్యాక్ చేయాలి. తెల్ల పేపర్ పై రైతు పేరు పట్టా నెంబరు మొబైల్ నెంబరు పోస్టల్ అడ్రస్ వివరాలను రాసి అందులో వేసి పెంచేసి మట్టి పరీక్ష కేంద్రానికి చేర్చినట్లైతే మట్టి పరీక్షలు నిర్వహించి ఫలితాలను అందిస్తారు. ఇది ఎంతో ముఖ్యం ప్రతి రైతు తప్పనిసరిగా మట్టి పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు గోపాల్ రెడ్డి, ఫియాజ్, దాదా సింగ్ తదితరులు పాల్గొన్నారు.