జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్ రోల్స్‌లో శ్రవణ్ జొన్నాడ రచన, దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘జాతస్య మరణం ధ్రువం’. త్రిష ప్రెజెంటర్‌గా సురక్ష్ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ నటి ప్రీతీ జింగానియా కూడా రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి ‘జాతస్య మరణం ధ్రువం’అనే టైటిల్ ఖరారు చేసిన మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని లాంచ్ చేశారు. ఒక సంస్కృత పద బంధం నుంచి వచ్చిన ఈ టైటిల్‌కు ‘పుట్టినవారికి మరణం తప్పదు’ అని అర్థం. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది. రాజేష్ శర్మ, తనికెళ్ల భరణి, లావణ్య షావుకారు, హిట్టెన్ తేజ్వాణి, మస్త్ అలీ, తులసి, ఈటీవీ ప్రభాకర్, జెమినీ సురేష్, షీనా చౌహాన్, షబీనా, ఇంధు, సోనియా, తాగుబోతు రమేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి రచన, సంగీతం – జిబ్రాన్, రాజ్, ఎడిటర్- విప్లవ్ నైషదం.