గుర్తుతెలియని వ్యక్తి మృతి


నవతెలంగాణ కంఠేశ్వర్ 

నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అపస్మార్క స్థితిలో పడి ఉన్న వ్యక్తి వయస్సు అందాజ 55 నుండి 60 సంవత్సరాలు ఉంటుందని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏడవ తేదీన చికిత్స గురించి అడ్మిట్ చేసినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ ఆయన 9వ తేదీన మృతి చెందాడని ఎస్ హెచ్ ఓ రఘుపతి బుధవారం తెలిపారు.తెలుపు రంగు అంగి ధరించి మృతి చెందాడన్నారు.ఇతని వాలకం బట్టి ఇతను బిక్షాటన చేసుకునే వ్వక్తిగా ఉన్నాడన్నారు. ఇతనికి సంబంచిన సమాచారం ఎవరికైనా తెలిసినచో  వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ లో ఫోన్ నెంబర్ 8712659714 కు సంప్రదించాలని తెలిపారు.

మరో వ్యక్తి

నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి బుధవారం తెలిపారు. ఎస్ హెచ్  రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో టీబీ వ్యాధి చికిత్స గురించి వయస్సు  60 సంవత్సరాల వృద్ధుడు నవంబర్ 15వ తేదీన చేరారు. చికిత్స పొందుతూ జనవరి 7వ తేదీన ఉదయం 10:40 నిమిషాలకు చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తి వయస్సు అందజ వయసు 60 నుంచి 65 సంవత్సరాలు, నలుపు రంగు స్వెటర్ ధరించి మృతి చెంది  ఉన్నాడు. ఇతని వాలకం బట్టి ఇతను బిక్షాటన చేసుకునే వ్వక్తిగా కనపడుతున్నది. ఇతనికి సంబంచిన సమాచారం ఎవరికైనా తెలిసినచో  వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ నెంబర్ 8712659714 కు సంప్రదించాలన్నారు .