గుర్తు తెలియని వ్యక్తి మృతి..

నవతెలంగాణ- తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తంగళ్ళపల్లి పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలోని మానేరు వాగు ఒడ్డునగల ఓ చెట్టుకు గుర్తుతెలియని వృద్ధుడు ఉరివేసుకొన్నట్లు శనివారం  తంగళ్ళపల్లి పోలీసులకు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకొని ఏఎస్ఐ పరిశీలించారు. మృతుడు గోధుమ రంగులో ఉన్న చొక్కా బూడిద రంగులో ఉన్న ప్యాంటు ధరించి ఉన్నాడని అతని ఆచూకీ ఎవరికైనా తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాల్సిందిగా వారు కోరారు.